మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సిబ్బంది, పాలకవర్గం సభ్యులు గత ఐదు సంవత్సరాలుగా చేసిన సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సోమవారం తెలిపారు. పాలకవర్గం ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలు ప్రజలకు ఎనలేని సేవలు చేశారని, పాలకవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.