వెల్దుర్తి మండలం శంసిరెడ్డి పల్లి తండాకు చెందిన దుర్గయ్య తన టీవీఎస్ వాహనం పై గురువారం దంతాలపల్లి నుండి వెళ్తుండగా తుఫ్రాన్ నుండి వస్తున్న ద్విచక్ర వాహనం దంతలపల్లి చౌరస్తా వద్ద ఢీ కొన్నది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.