మెదక్ పట్టణం లోని నర్సాపూర్ రహదారి వెల్కమ్ బోర్డు వద్ద షాపుల ముందు భాగంలో పెద్దపెద్ద గుంతలు తవ్వడంతో దుకాణదారులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు, షాపులకు కిరాయిలు కట్టుకుంటూ చిన్న వ్యాపారం చేసుకుంటున్నా మాకు 20 రోజులుగా ఈ యొక్క గుంతలు ఒక శాపం గా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే ఈ యొక్క గుంతలు పూడ్చాలని దుకాణదారులు డిమాండ్ చేస్తున్నారు.