రోడ్లపై ధాన్యం ఆరబోయొద్దని హెచ్చరించిన ఎస్సై

69చూసినవారు
యాసంగి సీజన్ వరి కోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు ధాన్యం రోడ్లపై ఆరబోయవద్దని ఎస్ఐ మహమ్మద్ గౌస్ సూచించారు. కొల్చారం పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రోడ్లపై ధాన్యం ఆరబోసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంట పొలాల వద్ద ధాన్యం ఆరబోసి కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్