దొంతి గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరించిన పురోహితుడు

78చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో జాతీయ జెండా ఎగురవేసే విషయంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గురువారం వివాదం నెలకొంది. గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసి జాతీయ జెండా ఎగురవేసే విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. చివరకు గ్రామానికి చెందిన పురోహితుడితో జాతీయ జెండా ఎగురవేయించారు.

సంబంధిత పోస్ట్