మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామంలో సైకిల్ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కాగిత స్వామి ఇంటి ముందు పార్కు చేసిన సైకిల్ ను గుర్తు తెలియని దొంగ చోరీ చేశాడు. చోరీ ఘటన గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీలో రికార్డైంది. గ్రామంలో దొంగలు తిరుగుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గ్రామస్థులు కోరుతున్నారు.