భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు సద్విని చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. తూప్రాన్ పట్టణంలో నిర్వహించిన భూభారతి సదస్సును గురువారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న వెంటనే సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.