సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద పనిచేస్తున్న కార్మికులు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఐదు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని కాంట్రాక్టు కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం 18, 000 అమలు చేయాలని డిమాండ్ చేశారు.