ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం: ఎమ్మెల్యే
మంత్రి కొండా సురేఖ కేటీఆర్, సమంతపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి బుధవారం అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. మహిళను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడిన అది తప్పే అని, కొండా సురేఖ విషయంలో అందరము ఖండించామని, కానీ కొండా సురేఖ తోటి మహిళలపై ఈరోజు చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు.