జిల్లాలో కల్తీ కల్లును అరికట్టాలి: సీపీఎం

80చూసినవారు
జిల్లాలో కల్తీ కల్లును అరికట్టాలి: సీపీఎం
సంగారెడ్డి జిల్లాలో కల్తీ కల్లును అరికట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, ఎక్సైజ్ సిఐ దుబ్బాక శంకర్ లకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కల్లుగీత కార్మిక కుటుంబాలకు కాంట్రాక్టర్ల నుండి రక్షణ కల్పించి కాపాడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్