నేటి నుంచి మేడారం మినీ జాతర

84చూసినవారు
నేటి నుంచి మేడారం మినీ జాతర
TG: ములుగు(D) తాడ్వాయి(M) మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మినీ జాతర నేటి నుంచి 15 వరకు జరగనుంది. రెండేళ్లకోసారి జరిగే మహాజాతర తర్వాత చిన్నస్థాయిలో జరిగే వేడుక ఇది. బుధవారం మండమెలిగే పండుగతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గురువారం మండమెలిగే పూజలు, శుక్రవారం మొక్కుల చెల్లింపు, శనివారం చిన్నజాతర ఉంటాయి. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

సంబంధిత పోస్ట్