అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన మెడికో అరుణ్ ప్రశాంత్ తన అనుభవాన్ని వివరించారు. భోజనానికి ఐదో ఫ్లోర్‌కు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం, పొగలు వచ్చాయని చెప్పారు. ఏమవుతుందో అర్థం కాక కిందకి పరిగెత్తి, మొదటి అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నానని తెలిపారు. బయటకు వచ్చాకే విమానం కూలిన విషయం తెలిసిందని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి.