గత BRS ప్రభుత్వ అసమర్థతతోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయని చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హరీశ్ రావు మాటలు నమ్మాల్సిన అవసరం తమకు లేదని.. ఇప్పటికైనా హరీష్ అబద్ధాలు మానుకోవాలని విమర్శించారు.