TG: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు పంపిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భేటీ అయినట్లు తెలుస్తోంది. నోటీసులు అందడంతో తర్వాత ఏం చేయాలనేదానిపై చర్చించినట్లు సమాచారం. అలాగే వీరు ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.