పుదీనా సాగుకు అనుసరించాల్సిన పద్ధతులు

71చూసినవారు
పుదీనా సాగుకు అనుసరించాల్సిన పద్ధతులు
పుదీనా కాండం మొక్కలుగా నాటుకోవడం ద్వారా సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఎకరానికి 350-500 కేజీల కాండం మొక్కలు అవసరమవుతాయి. మొక్క వరుసల మధ్య 20-40 సెం.మీ. దూరం ఉండాలి. నేల స్వభావాన్ని బట్టి శీతాకాలంలో 6 నుంచి 12 రోజులు, వేసవిలో 3 నుంచి 4 రోజులకోసారి నీటిని అందించాలి. నేల ద్వారా సంక్రమించే కాండం కుళ్లును అరికట్టడానికి పంట మార్పిడి చేయాలి. మొక్కలు నాటిన 3 నెలల తర్వాత తొలకరి కోత వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్