హైదరాబాద్‌ను తిరోగమనం వైవు తీసుకెళ్లే ఏ నిర్ణయం మంచిది కాదని BRS ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో రిజిస్ట్రేషన్ ఆదాయం నెలకు రూ.200 కోట్ల మేర తగ్గిందని చెప్పారు. 'ప్రతిపాదించిన కొత్త మెట్రో మార్గాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలి. కేసీఆర్ హయాంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మెట్రో ఛార్జీలు పెంచలేదు. కరోనా సమయంలో మెట్రో రైలు నష్టాల్లో నడిచినా కేసీఆర్ ఛార్జీల పెంపు నిర్ణయానికి ఒప్పుకోలేదు' అని వివరించారు.