ఢిల్లీలో భారీ వర్షం, ఈదురుగాలులతో కలకలం రేగింది. న్యూ అశోక్ నగర్ ర్యాపిడ్ రైల్ మెట్రో స్టేషన్‌పై బలమైన గాలులు విరుచుకుపడ్డాయి. దీంతో స్టేషన్‌పై ఉన్న టిన్ షెడ్ ఎగిరిపడి ఒక వాహనంపై పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.