TG: హైదరాబాద్ మెట్రో టికెట్ ధరల పెంపును తక్షణం వెనక్కి తీసుకోవాలని నగర BRS ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 'పేద, మధ్యతరగతి ప్రజలపై టికెట్ ధరలు భారం పడుతుంది. ధరల పెంపుతో ఒక ప్రయాణికుడికి నెలవారీ ఖర్చు రూ.500-600 పెరుగుతుంది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. HYDలో కూడా మెట్రో ఛార్జీలు పెంపుపైన ప్రజా వ్యతిరేకత ఖాయం' అని పేర్కొంటూ హెచ్చరించారు.