హైదరాబాద్ లోని పాతబస్తీలో మెట్రో పనులు ప్రారంభమయ్యాయి. MGBS నుంచి చాంద్రాయణ గుట్ట వరకు మెట్రోను పొడిగించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో మెట్రో అధికారులు ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకొని కూల్చివేతలు ప్రారంభించారు. కొత్తగా దాదాపు 7.5 కిలోమీటర్లు మెట్రో పనులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.