ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ తన ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. భారత మార్కెట్లోకి అడుగు పెట్టి ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. తన తొలి ఎలక్ట్రిక్ వాహనం జెడ్‌ఎస్ ఈవీపై ఏకంగా రూ.4లక్షల తగ్గింపు ప్రకటించింది. పరిమిత కాలం మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. టాప్-ఎండ్ ఎసెన్స్ వేరియంట్‌పై ఏకంగా రూ.4.44లక్షలు తగ్గింపు అందిస్తుంది.