పాలిచ్చే పశువులు చూడి దశలో ఉన్నప్పుడే దాణాలో సరిపడా కాల్షియం ఉండేలా చూసుకోవాలి. లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు, పచ్చిమేత, ఎముకల పొడిలో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని పశువులకు అందించాలి. ఈ విషయంలో పశువైద్యుడి సలహా తీసుకోవాలి. పశువులు ఈనిన వెంటనే కాల్షియంతో కూడిన ఇంజెక్షన్లు, ఈనే 5 రోజుల ముందు నుంచి విటమిన్ డి ఇంజక్షన్లు ఇవ్వడం ఉత్తమం. అధిక పాలిచ్చే పశువుల్లో ఈనిన తరువాత పాలను పూర్తిగా పితకవద్దు.