TG: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతున్న మినీ మేడారం జాతర శనివారంతో ముగిసింది. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో హాజరై వనదేవతలను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చే బుధవారం నుంచి తిరుగువారం పండగ నిర్వహిస్తారు. కాగా, వచ్చే ఏడాది మహా జాతర జరగనుంది.