కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. ఇవాళ, రేపు జాగ్రత్త

64చూసినవారు
కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. ఇవాళ, రేపు జాగ్రత్త
తెలంగాణలో మరో రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. చలి దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, అలర్జీ ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్