తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా మంత్రుల పనితీరుపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా పనుల కోసం, ఫైళ్ల క్లియరెన్స్ కోసం డబ్బులు మంత్రులు తీసుకుంటారని.. కానీ తాను డబ్బులు తీసుకోనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డిని షాక్‌కు గురిచేశాయి. డబ్బులు లేకుండా మంత్రులు పని చేయరన్న ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి.