వరంగల్లో బీరన్న బోనాలకు మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. బీరన్న స్వామికి బోనమెత్తి మొక్కు తీర్చుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. వరంగల్లో తొలి బోనం బీరన్నకే కావడం సంతోషంగా ఉందన్నారు. బోనం ఎత్తడం ఒక ప్రత్యేకత అయితే.. ఇక్కడ గొర్రెను కురమ పూజారులు గావ్ పట్టడం మరో ప్రత్యేకత అన్నారు. రాష్ట్రంలో మొదటి బోనం వరంగల్ భద్రకాలిదే అనుకున్నా.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సంకల్పం ఆగిందన్నారు.