గొల్లపూడి మార్కెట్‌యార్డ్‌లో మంత్రి మనోహర్‌ ఆకస్మిక తనిఖీలు

82చూసినవారు
గొల్లపూడి మార్కెట్‌యార్డ్‌లో మంత్రి మనోహర్‌ ఆకస్మిక తనిఖీలు
AP: విజయవాడలోని గొల్లపూడి మార్కెట్‌ యార్డ్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ధాన్యం కొనుగోలు, రైతులకు కలిగే ప్రయోజనాలపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులపై రైతులతో మాట్లాడారు. రైతులను ఇబ్బంది పెట్టే రైస్‌ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్‌ హెచ్చరించారు. ప్రతి ధాన్యపు బస్తానూ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్