AP: అమరావతిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. రాజధానిని కేవలం మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేయనున్నట్టు సర్కారు ప్రకటించింది. అదేవిధంగా ఇప్పటి వరకు వైసీపీ ప్రచారం చేస్తున్నట్టుగా.. రాజధాని నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చుకావని కూడా వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి పూర్తిగా 64వేల 721 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.