మంత్రి నిమ్మల, ఎమ్మెల్యేలకు తృటిలో తప్పిన ప్రమాదం

59చూసినవారు
మంత్రి నిమ్మల, ఎమ్మెల్యేలకు తృటిలో తప్పిన ప్రమాదం
ఏపీ మంత్రి, పలువురు ఎమ్మెల్యేలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడితో పాటు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నిమ్మల పూలమాల వేస్తున్న క్రమంలో స్టేజి ఒక్కసారిగా కిందికి వంగింది. దీంతో స్టేజీపై ఉన్న మంత్రి, ఎమ్మెల్యేలు కింద జారిపడకుండా అక్కడే ఉన్న కార్మికులు అడ్డుకోవడంతో అధికారులు, పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్