వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో 72 శాతం పనులు పూర్తిచేశామని, 18 నెలలు కష్టపడి డయాఫ్రం వాల్ నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని దుయ్యబట్టారు. శనివారం పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఆయన స్వాగతం పలికి మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పనులు చేస్తామని చెప్పారు.