ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం(M) పలు గ్రామాల్లో బి.టి.రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బచ్చోడ-ఉర్లగొండ డొంక వరకు రూ.3 కోట్ల 15 లక్షలతో, రాజారాం-జూపెడ వరకు రూ.2 కోట్ల 42 లక్షలతో 2.2 km పొడవు, సోలిపురం-హలావత్ తండా వరకు రూ.కోటి 83 లక్షలతో, పీక్యా తండా-కాకరవాయి వరకు రూ.3 కోట్ల 15 లక్షలతో 3km మేర నిర్మించనున్న బి.టి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.