కొత్త ప్రభాకర్ రెడ్డిపై మంత్రి పొంగులేటి కౌంటర్ (వీడియో)

60చూసినవారు
BRS MLA కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి తీవ్రంగా స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల వెనుక మాజీ CM KCR ఆత్మ ఉందని, ఆయన సూచనలతోనే మాట్లాడుతున్నారని విమర్శించారు. భూభారతి చట్టం అమలవుతోందన్న విషయం వారు జీర్ణించుకోలేక గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్ని కోట్లు ఖర్చయినా MLAలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే KCR కుట్ర అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్