తెలంగాణలో జూన్ 2 నుంచి గ్రామాలకు రెవెన్యూ అధికారులే వచ్చి భూభారతి చట్టం దరఖాస్తులు స్వీకరిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్రంలో6000 మంది సర్వేర్లనుఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాదా బైనామాలు శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.