యువకుల గల్లంతుపై మంత్రి పొన్నం ఆరా

81చూసినవారు
యువకుల గల్లంతుపై మంత్రి పొన్నం ఆరా
సిద్ధిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌లో యువకుల గల్లంతుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. సిద్దిపేట కలెక్టర్‌ మను చౌదరితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటనపై గాలింపు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఇకపై ప్రాజెక్ట్‌ వద్ద ఎవరూ ఈతకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. కాగా, శనివారం మధ్యాహ్నం కొండపోచమ్మ సాగర్‌ డ్యామ్‌లో పడి ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్