కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. వీటి కోసం జనవరి 16 నుంచి 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితాను 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభల్లో పెట్టి ప్రజాభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులకు గత నిబంధనలే వర్తిస్తాయని తెలిపారు.