తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విధానాలపై బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తుందని ఆయన ఆరోపించారు. ‘మేము ఏ పథకాన్ని నిలిపివేయలేదని స్పష్టంగా చెప్పగలం. తమ ప్రభుత్వ హయాంలో కొత్త ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు విద్యాబోధన సక్రమంగా అందించాలని సూచిస్తున్నాం’ అని చెప్పారు.