TG: హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందుల నివారణకు ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ అధికారుల పనితీరు మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యలు తెలియజేయాలని పొన్నం సూచించారు.