TG: బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు తాము సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ విషయంపై శాసనసభా వేదికగా చర్చించేందుకు రెడీగా ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారని గుర్తు చేశారు. అయితే బనకచర్లపై చర్చకు రావాలని సీఎం రేవంత్ కి KTR సవాల్ చేసిన నేపథ్యంలో మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. చర్చకు ప్రెస్ క్లబ్ లో కాకుండా, రికార్డుల కోసం కేసీఆర్ ను తీసుకొని శాసనసభకు రావాలని అన్నారు. చర్చ ఎక్కడ చేయాలో తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు.