తెలంగాణ కులగణనపై కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో, బీసీ సంఘాలు, మేధావులతో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సమావేశం కానున్నారు. బీసీ జనాభాకు అనుగుణంగా నిధులు అడుగుదామా? ఉపప్రణాళిక కోరుదామా? ఉపాధి శిక్షణ చేపట్టాలా? అనే అంశాలపై విద్యావంతులు, మేధావులు, బీసీ సంఘాలు సూచనలు, సలహాలను మంత్రి పొన్నం స్వీకరించనున్నారు.