TG: రాష్ట్రంలోని సనత్‌నగర్, అల్వాల్, కొత్తపేట టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది చివరికల్లా హాస్పిటళ్లను ప్రారంభించాలన్నారు. ఆసుపత్రుల సివిల్ వర్క్స్, ఎక్విప్‌మెంట్, డాక్టర్లు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. హాస్పిటళ్లు ప్రారంభించిన రోజు నుండే వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్నారు.