పాకిస్థాన్‌తో దాడులకు సంబంధించి వివరాలు చెప్తున్న సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఉగ్రవాదులు భారత మహిళలను వితంతువులుగా మార్చారని, అటువంటి వారి మతానికి చెందిన మహిళను మోదీ పాక్‌కు పంపించి బుద్ధి చెప్పారని ఆయన పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై స్పందించిన బీజేపీ మంత్రికి చీవాట్లు పెట్టింది.