మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష

63చూసినవారు
మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష
TG: అంగన్ వాడీ కేంద్రాల్లో పోషకాహారం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల్లోని అంగన్వాడీలకు సైతం ప్రతిరోజు పాల సరఫరా జరగాల్సిందేనన్నారు. శనివారం సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు పాలు, పప్పు వంటి వస్తువుల సరఫరా, ఏజెన్సీల పనితీరుపై సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో సరఫరాలో గ్యాప్ ఉండటంపై మంత్రి ఆగ్రహం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్