తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడుగా మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. 2026 వరకు తన పదవీకాలం ఉండగా కేటీఆర్ హఠాత్తుగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. తమ ప్రభుత్వం స్పోర్ట్స్ ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంకల్పించారని చెప్పారు.