TG: వరుస వివాదాస్పద వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఆమెను మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో తర్వలో మంత్రి పదవి నుంచి కూడా తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. సురేఖ వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయని అదిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆ పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే టాక్ నడుస్తోంది.