పీసీ ఘోష్‌ కమిషన్‌కు మంత్రి తుమ్మల లేఖ

81చూసినవారు
పీసీ ఘోష్‌ కమిషన్‌కు మంత్రి తుమ్మల లేఖ
TG: 'కాళేశ్వరం' ప్రాజెక్టుపై విచారణ చేపడుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఈ లేఖతో పాటు గత BRS ప్రభుత్వ హయాంలో రూపొందించిన కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులు, మంత్రివర్గ సమావేశాల మినిట్స్‌ను కూడా జోడించి పంపారు. ఈ అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీల నిర్మాణం మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకే జరిగిందని ఈటల రాజేందర్ తెలుపగా.. వాటిని మంత్రి తుమ్మల తీవ్రంగా ఖండించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్