గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం రాజ్ భవన్ కు తన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి రాజ్ భవన్ కు వెళ్లిన ఉత్తమ్.. గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేపు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ పర్యటనపై చర్చించారు. కాగా రేపు ఉ.10:30 గంటలకు గవర్నర్ సూర్యాపేట కలెక్టరేట్ కు చేరుకోనున్నారు. 11:30 గంటల వరకు జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం ఉండనుంది.