తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన కులగణనలో బీసీ జనాభా తగ్గిందని విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. గత గణాంకాలతో పోలిస్తే బీసీ జనాభా పెరిగిందని చెప్పారు. BRS పాలనలో 51.09%గా నమోదైన బీసీ జనాభా శాతం ఇప్పుడు 56.33%కు పెరిగిందన్నారు. ఓసీల జనాభా 21.55% నుంచి 15.79%కు తగ్గిందని చెప్పారు. ఈ సర్వే ద్వారా అందిన గణాంకాలను పాలస, సంక్షేమ విధానాల్లో వినియోగిస్తామని చెప్పుకొచ్చారు.