HYD-బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలతో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ సమావేశమయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు మంత్రులు సూచించారు.