TG: మంత్రి కొండా సురేఖ మరోసారి నోరు జారారు. వరంగల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సురేఖ ఫైళ్లు క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారంటూ వ్యాఖ్యానించారు. 'తమ వద్దకు వచ్చిన కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అది సాధారణంగా జరిగేదే. కానీ నేను మాత్రం అలా తీసుకోను. దానికి బదులు సమాజ సేవ చేయాలని చెబుతా' అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.