దేశంలోని అమరవీరులకు నివాళులర్పించేందుకు.. ఈ వీర అమరవీరుల పేర్లను రైల్వేశాఖ రైల్వే లోకోమోటివ్ డీజిల్ ఇంజిన్‌లకు పెట్టనున్నట్లు రైల్వేమంత్రిత్వశాఖ గురువారం తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. దీని కోసం.. రైల్వేస్ కొత్త గ్లీమింగ్ ఇంజిన్‌పై అమరవీరుల పేర్లను వ్రాసిన వీడియో, ఫోటోను కూడా షేర్ చేసింది.