కేజీహెచ్‌లో మైనర్ బాలిక ప్రసవం

51చూసినవారు
కేజీహెచ్‌లో మైనర్ బాలిక ప్రసవం
AP: విశాఖలోని కేజీహెచ్‌లో 17 ఏళ్ల బాలిక ప్రసవించింది. అనకాపల్లికి చెందిన బాలిక భీమిలిలోని ఓ హాస్టల్‌లో చదువుతోంది. కడుపునొప్పి రావడంతో కేజీహెచ్‌లో చేర్పించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా బాలిక గర్భం దాల్చినట్లు తేలింది. అయితే నెలలు నిండని మగబిడ్డ పుట్టి చనిపోయినట్లు సమాచారం. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బాలికను ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని శారీరకంగా దగ్గరైనట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్